
కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలం పార్టీకి గుడ్ బై చెప్పేసి బిజెపిలో చేరిపోయారు. ఆయన తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంపించిన తరువాత నిన్న ఢిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, డికె.అరుణ, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో బిజెపిలో చేరిపోయారు.
కూన శ్రీశైలం 2009 ఎన్నికలలో కుత్బుల్లాపూర్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ పార్టీ పరిస్థితి క్రమంగా ఆగమ్యగోచరంగా మారుతుండటంతో గత కొంతకాలంగా రాష్ట్ర బిజెపి నేతలతో టచ్‌లో ఉన్నారు. ఆ చర్చలు ఫలించడంతో బిజెపిలో చేరిపోయారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు డీసీసీ అధ్యక్షుడు రాజీనామా కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది.