టిఆర్ఎస్‌ రెండో ఎమ్మెల్సీ అభ్యర్ధి ఖరారు

దివంగత ప్రధాని పీవీ నరసింహరావు కుమార్తె వాణీదేవిని టిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా సిఎం కేసీఆర్‌ ఈరోజు ఖరారు చేశారు. ఆమె హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీ చేయబోతున్నారు. వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.   

ఎన్నికల షెడ్యూల్: 

ఫిబ్రవరి 16: నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 23: నామినేషన్లు దాఖలుకు చివరి రోజు 

ఫిబ్రవరి 24: నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 26: నామినేషన్ల ఉపసంహరణ

మార్చి 14: పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

మార్చి 17: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.