
న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్య కేసులో నిందితుడిగా పేర్కొనబడిన టిఆర్ఎస్ మంధని మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్‌పై టిఆర్ఎస్ బహిష్కరణ వేటు వేసింది. కుంట శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టిఆర్ఎస్ ప్రకటించింది.
ఈ హత్య కేసుపై ప్రతిపక్షాలు టిఆర్ఎస్ పార్టీపై, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండటం, హైకోర్టు కూడా ప్రభుత్వ విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారిందంటూ ఆక్షేపించడం, హత్యకు ముందు కుంట శ్రీనివాస్ మాట్లాడిన కొన్ని మాటలు టిఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి ఇరుకునపెట్టేవిగా ఉండటం వంటి అనేక కారణాలతో టిఆర్ఎస్ అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు భావించవచ్చు. ఈ హత్యతో పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబందమూ లేదని టిఆర్ఎస్ స్పష్టం చేసింది.