టిఆర్ఎస్‌ ఒక్క ఎమ్మెల్సీ స్థానానికే పోటీ చేస్తుందా?

మార్చి 14వ తేదీన జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ, అన్ని పార్టీలు తమ తమ అభ్యర్ధులను నిలబెడుతున్నాయి. ఈనెల 16 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలై 23వరకు సాగుతుంది. అయితే టిఆర్ఎస్‌ వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఖరారు చేసింది తప్ప హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి పార్టీ అభ్యర్ధిని ఇంతవరకు ప్రకటించలేదు. నామినేషన్ దాఖలు చేసేందుకు ఇంకా 5 రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్నప్పటికీ, ఎటువంటి సంకేతాలు ఇవ్వకపోవడంతో ఆ స్థానం నుంచి టిఆర్ఎస్‌ పోటీ చేయకపోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ బిజెపి ఎమ్మెల్సీ రామచంద్రరావును ఢీకొని ఓడించడం కష్టమని కనుక వామపక్షాల మద్దతుతో బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు పరోక్షంగా సహకరించడం మంచిదని టిఆర్ఎస్‌ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవే నిజమైతే ఈ ఎన్నికలలో బిజెపి టిఆర్ఎస్‌ను కాక ప్రొఫెసర్ నాగేశ్వర్‌ను ఎదుర్కోవలసిరావచ్చు. 

ఎన్నికల షెడ్యూల్: 

ఫిబ్రవరి 16: నోటిఫికేషన్‌ జారీ, నామినేషన్ల స్వీకరణ

ఫిబ్రవరి 23: నామినేషన్లు దాఖలుకు చివరి రోజు 

ఫిబ్రవరి 24: నామినేషన్ల పరిశీలన

ఫిబ్రవరి 26: నామినేషన్ల ఉపసంహరణ

మార్చి 14: పోలింగ్ (ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు)

మార్చి 17: ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటన.