ఏపీ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం.. స్టే విధింపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పధకంపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూనే ఉంది. దానిపై తెలంగాణ ప్రభుత్వం నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించగా ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తూనే ఉంది. దాంతో తెలంగాణకు చెందిన జి.శ్రీనివాస్ అనే న్యాయవాది చెన్నైలోని నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ బెంచ్‌లో ట్రిబ్యూనల్ ధిక్కార పిటిషన్‌ వేశారు. దానిపై సోమవారం విచారణ చేపట్టిన నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌, ప్రాజెక్టు పనులను తక్షణం నిలిపివేయాలని మళ్ళీ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం, పిటిషనర్ల అభ్యర్ధన మేరకు ఆ ప్రాజెక్టు పనుల గురించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయడంపై అభిప్రాయం తెలుపవలసిందిగా కృష్ణా జలమండలిని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.