
బిజెపి రాబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం బిజెపి కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం హైదరాబాద్లో జరిగింది. ఈ సమావేశంలో హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి ఎన్. రామచంద్ర రావును, వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించింది. ఈ ఇరువురు నేతలు ఇదివరకే ప్రచారాన్ని ప్రారంభించారు. మంగళవారం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. బిజెపి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో వచ్చిన ఫలితాల ఉత్సాహంతో మరో ఎన్నికలకు సిద్ధం అయింది.