సాగర్ ఉపఎన్నికల బరిలో టిడిపి

త్వరలో నాగార్జునసాగర్ ఉపఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా పోటీకి సై అంది. టిడిపి రాష్ట్ర  అధ్యక్షుడు ఎల్ రమణ తమ పార్టీ అభ్యర్ధిగా మువ్వ అరుణ్ కుమార్ పేరును నేడు ప్రకటించారు. ఈ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా కె. జానారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ ఉపఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్‌ కూడా వెలువడలేదు కనుక తెరాస, బిజెపిలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు. కాంగ్రెస్‌, టిడిపిలు అభ్యర్ధులను ప్రకటించి ప్రచారం మొదలుపెట్టేస్తాయి కనుక త్వరలోనే రెండు పార్టీలు తమ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది. టిఆర్ఎస్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. సాగర్ ఉపఎన్నికలు బరిలోకి టిడిపి కూడా ప్రవేశించినందున పోటీ రసవత్తరంగా సాగనుంది.