
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థలో ఓ సరికొత్త కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఆహారభద్రత కమిషనర్ చైర్మన్ తిరుమల రెడ్డి తెలిపారు. గురువారం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలంలో, పోతురాజుపల్లి, అల్లాపూర్ గ్రామాలలోని ప్రజాపంపిణీ దుకాణాల పరిశీలనకు తిరుమల్ రెడ్డి వెళ్లారు.
ఈ సందర్భంగా తిరుమల రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆహార భద్రతతో కార్డులో ఉన్న వృద్ధులకు, దివ్యాంగులకు వారి ఇంటివద్దకే రేషన్ సరుకులను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే ఆహారభద్రత కార్డుకు అనుసంధానం చేయబడిన మొబైల్ నెంబర్కు ఏ కారణం చేతైనా ఓటిపి రాకపోయినా ఐరీష్ విధానం ద్వారా సరుకులను తీసుకోవచ్చని అన్నారు.