
ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పిఆర్సి ఆలస్యం కానుంది. ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ త్రిసభ్య కమిటీ ఇదివరకే ప్రభుత్వోద్యోగ సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపింది.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత నాగార్జునసాగర్ ఉపఎన్నికలు కూడా జరుగనున్నాయి. దానికి కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే వెంటనే ఎన్నికలు కోడ్ అమలులోకి వస్తుంది కనుక ఆ ఎన్నికలు కూడా ముగిసేవరకు రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సిపై నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే పిఆర్సి ప్రకటిస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల కోడ్ కారణంగా పీఆర్సీ మరింత ఆలస్యం అవుతుందని తెలియడంతో ఆందోళనకు గురవుతున్నారు.