
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేదు వార్త అందించింది. బుధవారం లోక్‌సభలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి సంజయ్ దూత్రి ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసినట్లు ప్రకటించారు.
ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) పాలసీ కింద 2008 సం.లో అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఐటిఐఆర్ కోసం సుమారు రూ 3,275 కోట్లు కేటాయిస్తున్నట్లు 2013 సం.లో కేంద్ర ఐటీ శాఖ ప్రకటించింది.
అయితే ఐటిఐఆర్ ప్రాజెక్టు కోసమైనా అవసరమైన స్థలం, ఇతర సదుపాయాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయినందునే ఐటీఐఆర్ 2008 ప్రాజెక్టుకు నిధులను కేటాయించకూడదని నిర్ణయించామని మంత్రి సంజయ్ దూత్రి తెలియజేశారు. 2008లో ఐటీఐఆర్ ప్రాజెక్టు ఏర్పాటుకు అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ఐటిఐఆర్‌కి కేటాయించిన నిధులతోనే స్మార్ట్ సిటీ పనులు చేపట్టామని కేంద్ర సహకార కేంద్ర ఐటి శాఖ సహాయ మంత్రి సంజయ్ దూత్రి లోక్‌సభలో తెలియజేశారు.