
త్వరలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సాయంత్రం ఇద్దరు అభ్యర్ధులను ప్రకటించింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి రాములు నాయక్, మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి నియోజకవర్గానికి చిన్నారెడ్డిని అభ్యర్ధులుగా ప్రకటించింది.
వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును సిఎం కేసీఆర్ ఇదివరకే ఖరారు చేసినందున ఆయన అప్పుడే ఆ మూడు జిల్లాలలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. త్వరలోనే మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి నియోజకవర్గానికి టిఆర్ఎస్ అభ్యర్ధి పేరును ప్రకటిస్తానని సిఎం కేసీఆర్ చెప్పారు.
బిజెపి తరపున మహబూబ్నగర్-హైదరాబాద్-రంగారెడ్డి నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్ర రావు మళ్ళీ పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కనుక వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గానికి అభ్యర్ధిని ప్రకటించవలసి ఉంది.