
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈరోజు నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై బీజేపీ నేతల దాడులను ఖండించారు. బీజేపీ నేతలు శాంతియుతంగా నిరసనలు తెలియజేయాలి తప్ప పోలీసులపై దాడులు దిగడం దారుణమన్నారు. పోలీసులపై దాడులు ద్వారా బిజెపి నేతలు ఏమి సాధించారని ప్రశ్నించారు. అన్ని రంగాలలో రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. నల్గొండలో ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. నల్గొండలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు ప్రభుత్వ నిధులు కేటాయించిందని అన్నారు. నల్గొండ సమగ్ర అభివృద్ధికి ఒక ప్రణాళిక రూపొందించామని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 10వ తేదీన నల్గొండలోని హాలియా జరిగే తెరాస సభకు లక్షలాది మందిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.