ఈటల రాజేందర్‌ ముఖ్యమంత్రి కావాలి: మల్లు రవి

కాంగ్రెస్ నేత మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు జడ్చర్లలో మల్లురవి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తర్వాత ఈటల రాజేందర్ సీఎం పదవికి అర్హుడని అన్నారు. ఈటల రాజేందర్ తెరాస పార్టీ ఏర్పడినప్పటి నుండి ఉన్నారని కాబట్టి ఆయన సీఎం పదవికి అర్హుడు అన్నారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఈటల రాజేందర్ చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈటల రాజేందర్ రైతులకు మద్దతు తెలపడంపట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు మల్లురవి తెలిపారు. తెరాసలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నా కేటీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది అని ఆరోపించారు. ఒకవేళ దళితులను సీఎం పదవి ఇస్తే బాల్క సుమన్, కొప్పుల ఈశ్వర్, రసమయి బాల కిషన్‌లలో ఎవరో ఒకరికి ఇవ్వవచ్చు కదా? అని మల్లు రవి ప్రశ్నించారు.