పాక్‌ భూభాగంలో ఇరాన్‌ సర్జికల్ స్ట్రైక్!

ఇరాన్‌ సాయుధబలగాలు మంగళవారం రాత్రి పాకిస్థాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేసాయి. ఇరాన్‌లో ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ ఈ విషయం నిన్న ప్రకటించింది. పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న జైష్-ఉల్-అదల్ అనే ఉగ్రవాద సంస్థ తమ ఇద్దరు బోర్డర్ సెక్యూరిటీ గార్డులను కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయారు. కనుక తమ సాయుధ బలగాలు మంగళవారం రాత్రి బలూచిస్తాన్‌లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి వారిద్దరినీ క్షేమంగా విడిపించుకు వచ్చాయని ఎలైట్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. సుమారు రెండునరేళ్ళ క్రితం ఇలాగే తమ గార్డులను కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయిందని అప్పుడు ఇరుదేశాలు కలిసి జాయింట్ మిలటరీ ఆపరేషన్ నిర్వహించి 10 మంది బోర్డర్ సెక్యూరిటీ గార్డులను విడిపించుకొన్నాయి. 

భారత్‌ కూడా రెండు మూడుసార్లు పాక్‌ భూభాగంలో సర్జికల్ స్ట్రైక్స్ చేసి అక్కడ తిష్టవేసిన ఉగ్రవాదులను వారి శిబిరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే.