సంబంధిత వార్తలు
తెలంగాణ బిజెపి రాష్ట్ర ఇన్-ఛార్జ్ తరుణ్ చుగ్ రాష్ట్ర పర్యటన రద్దయ్యింది. నేటి నుంచి మూడు రోజులపాటు త్వరలో ఎన్నికలు జరుగబోతున్న నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు, మెదక్, సిద్ధిపేట జిల్లాలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌తో కలిసి పర్యటించాలనుకొన్నారు. కానీ బండి సంజయ్ ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నందున తరుణ్ చుగ్ తన పర్యటనను రద్దు చేసుకొన్నారు. వారిరువురూ ఇప్పటికే ఒకసారి ఖమ్మం, వరంగల్‌లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.