తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్‌ లేఖ

తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ లేఖ రాశారు. రాష్ట్రంలో ఉన్న 11 విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సిలర్, రిజిస్ట్రార్, ప్రొఫెసర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని సూచించారు. విశ్వవిద్యాలయాలలో వైస్ ఛాన్సిలర్ల నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2019 సం.లోనే ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయలేదని గవర్నర్‌ ప్రశ్నించారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జిలతో నడుస్తున్న అన్ని విశ్వవిద్యాలయాలకు పది రోజులలో కొత్త వైరస్‌ ఛాన్సిలర్లను నియమించాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. విశ్వవిద్యాలయాలలో శాశ్వత వైస్ ఛాన్సిలర్లు, సిబ్బంది లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని గవర్నర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.