బిహార్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం

బిహార్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియచేసేవారికి ప్రభుత్వ ఉద్యోగం, పాసుపోర్ట్, సంక్షేమ పథకాలు వంటివి వర్తింపచేయరాదని మంగళవారం ఓ జీవోను జారీ చేసింది. ఒకవేళ ప్రభుత్వోద్యోగులు నిరసనలలో పాల్గొంటే కాండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉండగా... బిహార్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై ప్రధాన ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ స్పందిస్తూ ప్రభుత్వంపై ప్రజలు నిరసన తెలియజేసే హక్కు లేదా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధానం బిహార్ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆరోపించారు. బీహార్ ముఖ్యమంత్రి నియంతలాగ తయారయ్యారని అన్నారు.