పట్టభద్రులకు టిఆర్ఎస్‌ అభ్యర్ధి వినతి

త్వరలో జరగబోయే ఖమ్మం-వరంగల్-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిన్న ఖమ్మం లో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి పి.రాజేశ్వర్ రెడ్డి,  స్థానిక ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా పి.రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలో గడిచిన ఆరు సంవత్సరాలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో సుమారు ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ వన్‌గా ఉన్నదని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలను అమలుచేసి అప్పుడు మాట్లాడాలని  అన్నారు. తెలంగాణ అభివృద్ధి జరగలేదని నిరూపించాలని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం పాటుపడే ఏకైక పార్టీ తెరాసనే అని అన్నారు. రాబోవు ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.