హన్మకొండలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల సభ

ఆదివారం హన్మకొండలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల కుల సంఘాల ఆధ్వర్యంలో మహాగర్జన సభ జరిగింది. ఈ సభలో ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ కులాల రాష్ట్ర అధ్యక్షుడు పొలాడి రామారావు, గౌరవ అధ్యక్షుడు రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి సభ్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులుపాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ అగ్రవర్ణాలలో కూడా ఆర్థికంగా వెనకబడి ఉన్నవారు చాలామంది ఉన్నారని వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ చట్టం తెచ్చిందని అన్నారు. రాష్ట్రంలో కూడా అన్ని విభాగాలలో ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం రిజర్వేషన్ అమలును సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈడబ్ల్యూఎస్‌పై ప్రతిపక్షాలు రాజకీయాలు చేయకుండా ఉంటే మంచిదని మంత్రి ఎర్రబెల్లి సున్నితంగా హెచ్చరించారు.