.jpg)
కరోనా..లాక్‌డౌన్‌తో దేశంలో కోట్లాదిమంది నిరుపేదలు, సామాన్య, మద్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. కనుక ఈరోజు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో ఆ వర్గాల ప్రజలకు వరాలు ఉంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలాగే కరోనా..లాక్‌డౌన్‌తో కుదేలైన పరిశ్రమలు, వ్యాపారవాణిజ్య సంస్థలు మళ్ళీ కోలుకొనేందుకు బడ్జెట్‌లో వరాలు ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేవిదంగా కరోనా..లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయిన దేశఆర్ధిక వ్యవస్థను మళ్ళీ బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో పలు చర్యలు ప్రకటించే అవకాశం కూడా తప్పక ఉంటుంది.
ఇటువంటి బడ్జెట్ ‘నెవర్ బిఫోర్’ (ముందెన్నడూ లేనట్లు)గా ఉండబోతోందని నిర్మలా సీతారామన్ స్వయంగా చెప్పడంతో బడ్జెట్‌పై దేశంలో అన్ని వర్గాలు చాలా ఆశలు పెట్టుకొన్నాయి. మరికొద్ది సేపటిలో ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. దానిలో లాంఛనంగా బడ్జెట్‌ను ఆమోదించిన తరువాత నిర్మలా సీతారామన్ దానిని ఉదయం 11 గంటలకు లోక్‌సభలో ప్రవేశపెడతారు. మరికొద్ది సేపటిలో ఎలాగూ నిర్మలమ్మ వడ్డించబోతోంది కనుక తినబోతూ గారెల రుచి ఎలా ఉందని ఊహించుకోవడం అనవసరమే.