రేషన్ సరుకులకు నేటి నుంచి ఓటిపి విధానం

రాష్ట్రంలో నేటి నుంచి అన్ని రేషన్ షాపులలో ఓటీపీ (వన్ టైంపాస్ వర్డ్) విధానం అమలులోకి రానున్నదని పౌర సరఫరా శాఖ అధికారులు తెలిపారు. ఆహార భద్రత కార్డుతో అనుసంధానం చేయబడిన మొబైల్ నెంబర్‌కు ఓటిపి  పంపిస్తామని తెలిపారు. రేషన్ షాప్‌లో  సరుకులు తీసుకోవాలంటే ఓటిపిని తెలియజేయవలసి ఉంటుందన్నారు.  ఒకవేళ ఆహార భద్రత కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోకపోతే ఐరిస్ విధానం ద్వారా సరుకులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కనుక ఆహార భద్రత కార్డులు కలిగి ఉన్నవారందరూ వీలైనంత త్వరగా తమ మొబైల్ నెంబర్లను అనుసంధానం చేసుకోవాలని అధికారులు సూచించారు.