త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.. మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా చేస్తున్న రాజీవ్ బెనర్జీ శుక్రవారం పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు12 మంది తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో బలమైన నేతగా...మంచి ప్రజాధారణ ఉన్న నాయకుడిగా గుర్తింపున్న సువేదు అధికారి రాజీనామాతోనే పెద్ద ఎదురుదెబ్బ తిన్న పార్టీకి ఇప్పుడు రాజీవ్ బెనర్జీ రాజీనామాతో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలినట్లే భావించవచ్చు. పార్టీలో కీలకనేతలు ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోతుండటంతో రానున్న పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలలో బిజెపి గెలుపుకు మార్గం సుగమం అవుతోందని భావించవచ్చు.