సంబంధిత వార్తలు

బిజెపి ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రత్యేకకోర్టు ఏడాది జైలుశిక్షవిధిస్తూ ఈరోజు తీర్పు చెప్పింది. ఆయనపై 2016లో ఉస్మానియా విద్యార్దులు బీఫ్ ఫెస్టివల్ నిర్వహించడంపై వివాదాస్పదవ్యాఖ్యలు చేసినందుకు బొల్లారం పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ 295 కింద కేసు నమోదైంది. ఆ సంఘటనల గురించి అందరూ మరిచిపోయారు కూడా. కానీ కేసు నమోదైనందున దానిపై ఇన్నేళ్ళ తరువాత కోర్టు తీర్పు వెలువడింది. రాజాసింగ్ వెంటనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవడంతో కోర్టు బెయిల్‌పై మంజూరు చేసింది. దీనిపై హైకోర్టులో అప్పీల్ చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పారు.