
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిన్న హైదరాబాద్ నగర శివారులోని బాట సింగారం వద్ద లాజిస్టిక్ పార్క్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ ట్రక్‌డాక్ లాజిస్టిక్ పార్క్‌ను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో హెచ్ఎండిఏ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. దీని ద్వారా లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశముందన్నారు. సుమారు 50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ లాజిస్టిక్ పార్క్‌ను నిర్మించబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే లార్జెస్ట్ పార్క్ పాలసీ ముసాయిదాను తయారుచేశామని త్వరలోనే దానిని ప్రకటిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రతిపక్షాలకు చురకలు వేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదా? అని ఘాటుగా ప్రశ్నించారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ సంస్థలు రావడం ద్వారా లక్షలాది ఉద్యోగ కల్పనకు అవకాశం ఉందనే సంగతి ప్రతిపక్షాలు గుర్తించాలన్నారు. అభివృద్ధికి ఆటంకం కల్పించకుండా, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.