వేతనసవరణపై బిశ్వాల్‌ కమిటీ సిఫార్సులు

విశ్రాంత ఐఏఎస్ అధికారి సిఆర్ బిశ్వాల్‌ ఛైర్మన్‌గా, విశ్రాంత ఐఏఎస్ అధికారులు ఉమామహేశ్వరరావు, మహమ్మద్ అలీ రహేఫత్‌లు సభ్యులుగా ఏర్పాటైన వేతన సవరణ సంఘం తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్‌కు ఇచ్చిన వేతన సవరణ నివేదికపై నేడు త్రిసభ్య కమిటీ చర్చించింది. బుదవారం సాయంత్రం 5 గంటలకు టీజీవో, టీఎన్జీవో సంఘాల‌తో దానిపై చర్చలు జరుపనుంది. ముందుగా ఈరోజు మధ్యాహ్నం ఆ వివరాలను ఉద్యోగ సంఘాలకు అందజేయనుంది. బన్సల్ కమిటీ నివేదికలో ప్రభుత్వోద్యోగుల వేతన సవరణలు తదితర అంశాలపై చేసిన సిఫార్సులు... 

1. 2018, జూలై 1 నుంచి ఈ వేతన సవరణలను అమలుచేయాలి.  

2. మూలవేతనంపై 7.5 శాతం  ఫిట్‌మెంట్

3. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19,000/-

4. గరిష్ట వేతనం రూ.1,62,070/-

5. పదవీ విరమణ వయసును 60 సం.లకు పెంచాలి. 

6. హెచ్ఆర్ఏ తగ్గింపు

7. గ్రాట్యుటీ పరిమితి రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు

8. శిశుసంరక్షణ కొరకు తల్లులకు సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంపు

9. సీపీఎస్‌లో ప్రభుత్వ వాటాను పెంచాలని సిఫార్సు.