నేడు నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో గణతంత్ర వేడుకలు

నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌లో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ త్రివర్ణ పతాకం ఎగురవేస్తారు. రాష్ట్రం కరోనా నుండి బయటపడిన తరువాత తొలిసారిగా జరుగుతున్న అధికార కార్యక్రమం ఇది. సిఎం కేసీఆర్‌, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కనుక నాంపల్లి పరిసర ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించి భద్రతను ఏర్పాటు చేశారు.