కేసీఆర్‌ పాడమన్నారు అందుకే ఆ పాట: జీవన్‌రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి సిఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్‌కు వయసు మీదపడుతుండటం వలన సరిగా పాలన చేతకావడం లేదని ఆరోపించారు. అందుకే ప్రజాప్రతినిధుల చేత కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అర్హుడని చెప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్ భారత్ రెండేళ్ల తర్వాత టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన ఇంకో ముఖ్యమైన పధకం అగ్రవర్ణ కులాలకు రిజర్వేషన్ల ఊసే ఎత్తడం లేదని ఆరోపించారు. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలను చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని జీవన్ రెడ్డి అన్నారు.