జనవరి 22 నుండి ఈ సమ్మిట్-2021

ఐటీ హైదరాబాద్ అధ్వర్యంలో ఈ-సెల్ సమ్మిట్-2021 నిర్వహించబోతున్నట్లు ఆ సంస్థ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ విద్యార్థులు అంకుర సంస్థలను నెలకొల్పేందుకు ప్రేరణ ఇవ్వడానికి ఈ సమిట్‌ను నిర్వహించబోతున్నట్లు తెలిపారు.

 ఈ సమ్మిట్ రేపూ అంటే జనవరి 22 నుండి మూడు రోజులపాటు ఆన్‌లైన్‌ వేదికగా నిర్వహించబోతున్న ట్లు తెలిపారు. దీనిలో పలురంగాలకు చెందిన నిపుణుల ప్రసంగాలు ఉంటాయని తెలిపారు. ఆ తర్వాత చర్చలు, పోటీలు తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కొన్ని ఎంపిక చేసిన ప్రత్యేక అంశాలపై బృంద చర్చలు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్‌లో గెలిచిన విజేతలకు రూ.5 లక్షలు బహుమతిగా ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సమ్మిట్‌లో టెస్లా మోటార్, శాంసంగ్, ఆర్‌ అండ్ బి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలకు చెందిన ప్రముఖులు పాల్గొంటారని ఐఐటీ హైదరాబాద్ అధికారులు తెలిపారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనదలిచేవారు ముందుగా https://www.ecell.in/esummit/register లో తమ వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ సమ్మిట్‌కు సంబంధించి పూర్తివివరాలు దానిలోనే లభిస్తాయి లేదా summit@ecell.in మెయిల్ అడ్రస్‌కు వ్రాసి తెలుసుకోవచ్చు.