ప్రభుత్వోద్యోలకు శుభవార్త

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ప్రభుత్వ ఉద్యోగులకు  తీపి కబురు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హెల్త్ కార్డులో కరోనా చికిత్సకు వెసులుబాటు కల్పించకపోవడంతో ఉద్యోగులు లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకున్నారు. నేటికీ కరోనా బారినపడిన ప్రభుత్వోద్యోగులు కరోనా చికిత్స కోసం లక్షలు చెల్లిస్తూనే ఉన్నారు. కనుక కరోనాబారినపడిన ప్రభుత్వోద్యోగులకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు లక్షరూపాయల వరకు మెడికల్ రీఎంబర్స్ మెంట్ అందజేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి తెలిపారు. ఈ మేరకు ఆయన బుదవారం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. 

 సామాన్య ప్రజలు కరోనా చికిత్స కోసం అటు గవర్నమెంట్ ఆసుపత్రులకు వెళ్ళలేక, ఇటు ప్రైవేట్ ఆసుపత్రులలో లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకొనే ఆర్ధిక స్తోమత లేక నానా అవస్థలు పడుతున్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి సామాన్య ప్రజలందరికీ ఉచితంగా చికిత్స అందజేస్తున్నారు. కనుక తెలంగాణలో కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.