మద్యం ప్రియులకు శుభవార్త

మద్యం ప్రియులకు తెలంగాణ అబ్కారిశాఖ  కిక్కిచ్చే  కబురు అందించింది. వివిద శుభకార్యాలు, బహిరంగ వేడుకలలో మద్యపానం కొరకు ఇకపై ప్రత్యేక అనుమతి తీసుకోనవసరం లేదని కానీ నిర్ణీత ఫీజు చెల్లించవలసి ఉంటుందని అబ్కారి  శాఖ అధికారులు తెలిపారు. వివిద శుభకార్యక్రమాలు, పుట్టినరోజు, పెళ్ళిళ్ళు, పండుగలు, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలు మద్యపానం చేస్తుంటారు కనుక ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. హైదరాబాద్ నగర చుట్టుపక్కల 5కిమీ పరిధిలో జరిగే కుటుంబ వేడుకలకు రూ.12,000 ఫీజు చెల్లించాలని, అదే...మిగతా జిల్లాలలో అయితే రూ.9,000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఆడిటోరియంలో 5,000 లోపు ప్రేక్షకులతో జరిగే పెద్ద వేడుకలకు రూ.50,000, అంతకంటే ఎక్కువమంది హాజరయ్యే కార్యక్రమాలకు రూ.2.50 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లా, మండల, గ్రామీణప్రాంతాలలో కూడా ఇది వర్తిస్తుందని వాటికి కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. దీనికి సంబందించి మరిన్ని వివరాలకు http://excise.telagana.gov.in వెబ్‌సైట్‌లో  చూడవచ్చని అధికారులు తెలిపారు. మద్యం వినియోగానికి సంబందించి వివరాలతో ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ నింపి పంపాలని సూచించింది.