సిఎం కేసీఆర్‌ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన

సిఎం కేసీఆర్‌ నేడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 11.30కు కాళేశ్వరం చేరుకొంటారు. అక్కడ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో పూజలు చేసిన తరువాత లక్ష్మీ బ్యారేజ్(మేడిగడ్డ)ను సందర్శిస్తారు. అనంతరం ప్రాజెక్టు మరియు జిల్లా నీటిపారుదలశాఖ  అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం మరోసారి వారితో మాట్లాడి 3 గంటలకు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌ తిరుగు ప్రయాణం అవుతారు. సిఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా జిల్లా పోలీసులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.