
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లకు, వ్యాపార సముదాయాలకు, కార్యాలయాలకు త్వరలో డిజిటల్ నెంబర్లను కేటాయించబోతునట్లు పురపాలక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఏపీ, తమిళనాడు, ఒడిశా తదితర రాష్ట్రాలలో ఈ డిజిటల్ చిరునామా విధానం విజయవంతంగా అమలుచేస్తున్నారు. వాటిపై అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్రంలో కూడా ఈ విధానాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద డిజిటల్ నెంబర్లు, క్యూఆర్ కోడ్ ఇవ్వనున్నామని తెలిపారు. ఈ డిజిటల్ విధానం ద్వారా త్వరగా అడ్రసును కనుగొనవచ్చని తెలిపారు. మొదటగా చిన్న పట్టణాలలో ఈ డిజిటల్ నెంబర్లు, క్యు ఆర్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ఆ తర్వాత దశలవారీగా అన్ని జిల్లాలకు...పట్టణాలలో కూడా దీనిని అమలు చేయనున్నట్లు అరవింద్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.