తెలంగాణలో కొత్త వృద్ధాప్య పింఛన్ పధకం: ఎర్రబెల్లి

జనగామ జిల్లా పాలకుర్తిలో ఆదివారం తెరాస కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ త్వరలోనే కొత్త వృద్ధాప్య పింఛన్లు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు తెలిపారు. 

వృద్ధాప్య పెన్షన్లు పొందడానికి వయోపరిమితిని 62 నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామని, నిరుద్యోగులందరికీ నెలకు రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తామని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస హామీ వచ్చింది. కానీ గడిచిన రెండు సంవత్సరాలుగా ఆ ఊసే ఎత్తని రాష్ట్ర ప్రభుత్వానికి నేడు ఎందుకు గుర్తుకు వచ్చిందంటే త్వరలో జరుగబోయే వరుస ఎన్నికలే అని భావించవలసి ఉంటుంది. కనుక ఇప్పుడైనా కనీసం కొత్త వృద్ధాప్య పెన్షన్, నిరుద్యోగ భృతి హామీలను అమలుచేస్తుందో లేక మళ్ళీ హామీలతోనే సరిపెడుతుందో చూడాలి.