పార్టీ శ్రేణులూ...ఎన్నికలకు సిద్దంకండి: కేటీఆర్‌

తెలంగాణ ఐటీశాఖ మంత్రి, తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రాబోవు వరంగల్ నగర పాలక సంస్థ, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్ర ఎన్నికల నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం శుక్రవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, వరంగల్ రూరల్, అర్బన్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటిఆర్ మాట్లాడుతూ రాబోవు వరంగల్ నగరపాలక సంస్థ ఎన్నికలకు, పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి ఒక్క తెరాస కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల ప్రభావం ఈ ఎన్నికలపై ఉండబోదని అన్నారు. తెరాస ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గట్టిగా ప్రచారం చేయాలని సూచించారు.

వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్ర నియోజకవర్గ ఎన్నికలు మార్చిలోగా జరిగే అవాకాశం ఉంది కనుక ఇప్పటి నుంచే  పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కేటీఆర్‌ కోరారు.