ఇక మాటలు ఉండవు: రైతు ప్రతినిధులు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. విపరీతమైన చలిని కూడా లెక్కచేయకుండా ఆందోళన చేస్తున్నారు. కేంద్రం ఇప్పటికే ఎనిమిదిసార్లు రైతులను చర్చలకు పిలిచిన అవి అన్నీ సఫలం కాలేదు. కాగా నేడు తొమ్మిదో విడత చర్చలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా రైతుసంఘాలు నేతలు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇదే ఆఖరి చర్చలని తెలిపారు. ఒకవేళ ఈరోజు చర్చలలో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించకపోతే తమ ఆందోళన మరింత ఉదృతం చేస్తామని హెచ్చారించారు. జనవరి 26న గణతంత్రదినోత్సవ వేడుకలలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలియజేస్తామని మళ్ళీ మరోసారి కేంద్రాన్ని హెచ్చరించారు. సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ పట్ల తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాల పరిశీలనకు సుప్రీంకోర్టు ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ మొదటి సమావేశం జనవరి 19 న జరగనుంది.