బిజెపికి భయపడే నోటిఫికేషన్లు: విజయశాంతి

రంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో సోమవారం భాజపా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫైర్ బ్రాండ్ మహిళా నాయకురాలు విజయశాంతి, సంగారెడ్డి భాజపా అధ్యక్షుడు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. రాబోయే అన్ని ఎన్నికలలో భాజపా గెలుస్తుందని ఆమె జోస్యం చెప్పారు. తెరాస ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం విధానాలపట్ల ప్రజలు విసుగు  చెందారని ఆరోపించారు. దుబ్బాక, జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు చూసైనా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు. రాబోవు ఎన్నికలలో భాజపాకు ఎక్కడ లాభం చేకూరుతుందో అనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు ప్రారంభించిందని విజయశాంతి ఆరోపించారు.