
ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ కిసాన్ సెల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జి బోసురాజు, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, సీనియర్ నేతలు వి.హనుమంత రావు, మధుయాష్కి, వంశీచందర్ రెడ్డి, కాంగ్రెస్ కిసాన్ సెల్ నాయకులు పాల్గొన్నారు.
కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు మరియు రాష్ట్రంలో రైతు వ్యవసాయ విధానాలపై ఈ సమావేశంలో లోతుగా చర్చించి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, భాజపా తెచ్చిన రైతు చట్టాలు కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలాగ ఉన్నాయని ఆరోపించారు. బడావ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్న భాజపాకు సామాన్య ప్రజలు, రైతుల కష్టాలు బాధలు కనబడటం లేదని ఆరోపించారు. మన రాష్ట్రంలో కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.