సంబంధిత వార్తలు
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. గత వారం మహిళా కమిషన్ ఏర్పాటుకు, దానికి మొదటి చైర్ పర్సన్‌గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనుక శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆమె హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించనున్నారు. ఆమెతో పాటు రేవతి రావు, కుమ్రా ఈశ్వరీబాయి, షహీన్ అఫ్రోజ్, గద్దల పద్మ, కొమ్ము ఉమాదేవి సభ్యులుగా ఉన్నారు.