సంబంధిత వార్తలు
22.jpg)
తెలంగాణ సీఎం కెసిఆర్ నిన్న కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తులలో మంటగా ఉన్నట్లు చెప్పడంతో ఆయన వ్యక్తిగత వైద్యులు ఎంపీ రావు, శ్వాసకోశ నిపుణుడు నవనీత సాగర్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్ సిఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు చేసారు. వారి సూచన మేరకు నిన్న సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కి వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు మళ్ళీ ఇవాళ్ళ ఉదయం యశోద హాస్పిటల్‌కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్. సిటి స్కాన్ వంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్య పరీక్షల నివేదికల గురించి యశోదా ఆశుయప్తృ వైద్యులు కానీ సీఎంఓ గానీ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.