కోమటిరెడ్డి బ్రదర్స్ వెన్నుపోటు పొడిచారు: మధుయాష్కీ

నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కి  సొంత పార్టీ నాయకులపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో  బుధవారం ఆయన మీడియాతో  మాట్లాడుతూ కోమటిరెడ్డి బ్రదర్స్ తనను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. పార్టీ పదవులు అన్ని సామాజిక వర్గాలకు సమానంగా ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి సూచించారు. పార్టీకి పూర్వవైభవం తేవాలంటే అన్ని వర్గాల కు సముచితస్థానం కల్పించాలన్నారు.  జీవన్‌రెడ్డి తనకు ఆప్తుడని ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే చాలా సంతోషిస్తానని అన్నారు. పిసిసి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మధుయాష్కి చేసిన ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు మరోసారి బయటపడ్డాయి.