తెలంగాణ నిరుద్యోగుల ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం టీసేవ-ఆన్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వాటి ద్వారా నగదు బదిలీ, కొత్త పాన్ కార్డులు, రైల్వే, టీఎస్ఆర్టీసీ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ లో టికెట్ బుకింగ్స్, ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఫోన్ రీఛార్జి తదితర సేవలను పొందవచ్చునని టి సేవా సంస్థ డైరెక్టర్ అడపా వెంకటరెడ్డి తెలిపారు. ఈ టీసేవా కేంద్రాల ఏర్పాటుకు నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. దరఖాస్తులను www.tsevacenter.com ద్వారా ఆన్లైన్లో పంపాలన్నారు. ఈ నెల 15వ తారీఖు వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని తెలిపారు. దీనికి సంబందించి మరిన్ని వివరాలకు మొబైల్ నెంబర్ 81799 55744ను సంప్రదించాలని తెలిపారు.