గ్లోబల్ టెక్నాలజీ సమిట్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం

ఈ ఏడాది ఏప్రిల్ 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజులపాటు జపాన్‌లోని టోక్యో నగరంలో గ్లోబల్ టెక్నాలజీ సమిట్‌ జరుగనుంది. రాష్ట్ర ఐ‌టి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ను దానిలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు బోర్గ్ బండ్ ఓ లేఖ వ్రాశారు. ఐ‌టి మంత్రిగా కేటీఆర్‌ తెలంగాణలో ఐ‌టి రంగాన్ని బాగా అభివృద్ధి చేస్తున్నారని ఆ లేఖలో బోర్గ్ ప్రశంసించారు. ముఖ్యంగా... ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్, అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్, జీ-20 స్మార్ట్ సిటీస్ అలయెన్స్ తదితర రంగాలు మంత్రి కేటీఆర్‌ సారధ్యంలో తెలంగాణలో ఎంతగానో అభివృద్ధి సాధించాయని బోర్గ్ ప్రశంసించారు.