సంబంధిత వార్తలు

తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ రాబోవు నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో తమ పార్టీ కూడా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సోమవారం జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో పాల్గొన్న ఆయన తరువాత మీడియాతో మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు మేము ఆశించిన ఫలితాలు రాలేదు. అయితే ఆ ఎన్నికలలో ఓడిపోయినప్పటికీ నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో తప్పకుండా పోటీ చేస్తాము. ఆ ఎన్నికలలో తెరాస ప్రభుత్వాన్ని ఎండగడతామని ఎల్.రమణ అని అన్నారు.