11.jpg)
తెలంగాణ ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సోమవారం చేనేత, జౌళి శాఖల సమీక్ష సమావేశం ప్రగతి భవన్‌లో జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చేనేత కమిషనర్ శైలజా రామయ్యర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సిఎం కేసీఆర్ ఆదేశాలతో జనగామ జిల్లా కొడకండ్ల మినీ జౌళి పార్కును ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నేతలకిచ్చే సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగుతాయన్నారు. ఏటా బతుకమ్మ చీరల కోసం సుమారు రూ.317 కోట్లు కేటాయింస్తున్నామన్నారు. రానున్న బడ్జెట్లో చేనేత, జౌళి రంగాలకు నిధుల కేటాయింపులపై నివేదికను తయారుచేయాలని చేనేత, జౌళి శాఖలను ఆదేశించారు. చేనేత, మరమగ్గాల నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు.