ఏపీ సిఎం జగన్‌కు బండి సంజయ్‌ వార్నింగ్

పొరుగు రాష్ట్రం ఏపీలో దేవాలయాలపై దాడులను రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని దాడులకు దిగుతున్నారు. ఏపీలో జరుగుతున్న దేవాలయాలపై దాడులకు సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్న రోజులలో భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఏపీలో దేవాదాయశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిందేనని అన్నారు. ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు నాయకత్వంలో తాము కూడా ఈ అంశంపై ఏపీ ప్రభుత్వంతో  పోరాటానికి సిద్ధంగా ఉన్నామని బండి సంజయ్‌ అన్నారు. రాబోవు తిరుపతి  లోక్‌సభ ఉపఎన్నికలలో భాజపాను గెలిపించాలని బండి సంజయ్‌ తిరుపతి ప్రజలకు పిలుపునిచ్చారు.