భారత్‌ బయోటెక్ కంపెనీకి మంత్రి కేటీఆర్‌ అభినందనలు

భారత్ బయోటెక్ రూపొందించిన  కోవాక్సిన్  టీకాకు డిసీజీఐ  అనుమతి లభించడం పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో హర్షం వ్యక్తం చేశారు. కోవ్యాక్సిన్ తయారీలో పాల్గొన్న శాస్త్రవేత్తలను, భారత్‌ బయోటెక్ కంపెనీ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. భారత్ బయోటెక్ ద్వారా హైదరాబాద్ కు మరింత బ్రాండ్ ఇమేజ్ పెరిగిందన్నారు. భారత్ బయోటెక్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ కృష్ణ ఎల్లా,  డాక్టర్ సుచిత్ర ఎల్లాలకు అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని ఫార్మా కంపెనీలు, శాస్త్రవేత్తల కృషి ఆవిష్కరణలతో నగరం వాక్సిన్ రాజధానిగా గుర్తింపు పొందుతూనే ఉంటుందని కేటీఆర్‌ ట్వీట్ చేశారు. అందుకు డాక్టర్ సుచిత్ర ఎల్లా మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్‌ ద్వారానే కృతజ్ఞతలు తెలుపుకున్నారు.