ఓవైసీ హటాత్తుగా బెంగాల్లో పర్యటన

మజ్లీస్‌ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఎవరికీ ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా చాలా రహస్యంగా ఆదివారం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని హుగ్లీ జిల్లాలో పర్యటించారు. తన రాకగురించి ముందుగా తెలిస్తే అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకొంటారనే ఉద్దేశ్యంతో తన పర్యటనను రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం పుర్‌పురా షరీఫ్‌కు చేరుకొని అక్కడి ముస్లిం మతపెద్దలు అబ్బాస్ సిద్దిఖీ, ఫీర్జాదాలతో రహస్యంగా సమావేశమయ్యి శాసనసభ ఎన్నికలలో మజ్లీస్‌ పోటీ చేయడం గురించి వారితో చర్చించారు.