
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన కొత్త సచివాలయ భవన నిర్మాణానికి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత సచివాలయం ఆవరణలో ఉన్న 607 భారీ వృక్షాలకు ఎలాంటి నష్టం కలిగించకుండా కాపాడుతామని, వాటిలో 27 చెట్లను ట్రాన్స్‌లొకేట్ పద్దతిలో వేరే చోటికి తరలించి కాపాడుతామని రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో కేంద్ర అటవీ, పర్యావరణశాఖ కొత్త సచివాలయం నిర్మాణానికిఅవసరమైన అనుమతులు మంజూరు చేసింది.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయం స్థానంలో సువిశాలమైన, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తోంది. సుమారు రూ.600 కోట్లు ఖర్చు చేసి ఏడంతుస్తులతో కూడిన సచివాలయం నిర్మించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.