4.jpg)
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నానంటూ చేసిన ప్రకటనతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారని సమాచారం. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ని బుజ్జగించడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రయత్నాలు చేశారని సమాచారం. ఇదిలా ఉండగా రాజగోపాల్ రెడ్డి ప్రకటనను కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే గుర్తింపు, గౌరవం, పదవులు అన్నీ పొంది పార్టీ కష్టకాలంలో రాజగోపాల్ రెడ్డి ఇటువంటి ఆలోచనలు చేయడం దురదృష్టకరమని మల్లు రవి అన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా నిన్న ఉదయం తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్ళిన రాజగోపాల్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే భాజపాలో చేరుతున్నట్లు విషయం తెలిసిందే.