ఎల్ఆర్ఎస్‌ ఎత్తివేసేవరకు మా పోరాటం ఆగదు: కోమటిరెడ్డి

భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్‌ పేరుతో డ్రామాలు ఆడుతోంది. అది లేకుండా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని చెపుతూ ప్రజలను మోసం చేస్తోంది. అసలు ఎల్ఆర్ఎస్సే ఉండకూడదని మేము చెపుతుంటే దాంతో సంబందం లేకుండా రిజిస్ట్రేషన్లకు అనుమతించడం ద్వారా దానిని రద్దు చేసినట్లు ప్రజలను మభ్యపెడుతోంది. ఎల్ఆర్ఎస్‌పై ఇప్పటికే మేము హైకోర్టులో పిటిషన్‌ కూడా వేసి న్యాయపోరాటం మొదలుపెట్టాము. ఎల్ఆర్ఎస్‌ను పూర్తిగా రద్దు చేసేవరకు మేము పోరాడుతాము. అన్నారు. ఎల్ఆర్ఎస్‌ను రద్దు చేయకపోతే ప్రజలే టిఆర్ఎస్‌ ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ది చెపుతారు,” అని అన్నారు.